బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత కోర్ట్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లో.. సన్నీ డియోల్..

బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత కోర్ట్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లో.. సన్నీ డియోల్..

బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో వస్తున్న హిందీ చిత్రం ‘ఇక్కా’.  వెర్సటైల్‌‌‌‌‌‌‌‌ యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్షయ్ ఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదొక హై-వోల్టేజ్ లీగల్ డ్రామా.  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ నెట్‌‌‌‌‌‌‌‌ ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లో శనివారం స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేసింది. జులై 10 నుంచి ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలియజేసింది. మహారాజ్‌‌‌‌‌‌‌‌, విఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌ పి మల్హోత్రా దీనికి దర్శకత్వం వహించారు. 

వైట్‌‌‌‌‌‌‌‌కాలర్ క్రిమినల్‌‌‌‌‌‌‌‌గా అక్షయ్ ఖన్నా  కనిపించగా తన హై ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ కేసును వాదించే లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సన్నీ డియోల్ నటించారు.  ‘బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో చివరగా ఈ ఇద్దరూ కలిసి కనిపించారు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ ఇందులో కలిసి నటించారు.  ‘ధురంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రం కంటే ముందు అక్షయ్‌‌‌‌‌‌‌‌ ఖన్నా ఫేజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.  

ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో నటించిన సినిమా ఇది. ఇప్పుడు స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌కు వస్తోంది. ఇందులో ఇంకా తిల్లోతమా శోమే, దియా మీర్జా, ఆకాంక్ష రంజన్ కపూర్, సంజీదా షేక్, జ్యోతి ముఖర్జీ, శిశిర్ శర్మ  కీలక పాత్రల్లో నటించారు.