బూట్ పాలిష్ వాలా..ఇప్పుడు ఇండియన్ ఐడల్

బూట్ పాలిష్ వాలా..ఇప్పుడు ఇండియన్ ఐడల్

న్యూఢిల్లీ: సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్11వ సీజన్ లో సన్నీ హిందుస్తానీ విజేతగా నిలిచాడు. గత ఏడాది అక్టోబర్ లో మొదలైన ఈ పోటీలో మొదట్నుం చీ సన్నీ తన ఆధిపత్యంచాటాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలోరోహిత్ రౌత్ (లాతూర్), అంకోనా ముఖర్జీ (కోల్కతా), అద్రిజ్ ఘోష్ (కోల్ కతా), రిధమ్ కల్యా ణ్(అమృత్ సర్) లతో పోటీ పడి విజేతగా నిలిచాడు. ఈ ఏడాది ఫైనల్ కు వెళ్లినవారి ఫిమేల్ కంటెస్టంట్లలో అంకోనా ఒక్కరే ఫైనల్ వరకు వెళ్లారు.ఇండియన్ ఐడల్ గా నిలిచిన సన్నీ రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్, కారు గెల్చుకున్నాడు. టీ సిరీస్ లో వచ్చేసినిమాలో పాట పాడే అవకాశం కొట్టేశాడు. బూట్ పాలిష్ చేసేవాడు సింగరయ్యాడు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన21ఏళ్ల సన్నీ.. రైల్వే స్టేషన్‌లో షూ పాలిష్ చేసేవాడు. ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. పాకిస్తాన్‌లోని ప్రముఖగాయకుడు నుస్రత్ ఫతే అలీఖాన్‌తో ప్రేరణ పొంది పాడటం మొదలుపెట్టాడు. తన తల్లి బెలూన్లు అమ్మి, ఇంటింటికి తిరిగి బియ్యం అడుక్కుని కుటుంబాన్ని పోషించేదని సన్నీ గుర్తు చేసుకున్నాడు.