WI vs AUS 2025: కంగారులకు అగ్ని పరీక్ష: స్మిత్, లాబుస్చాగ్నే లేకుండా ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11

WI vs AUS 2025: కంగారులకు అగ్ని పరీక్ష: స్మిత్, లాబుస్చాగ్నే లేకుండా ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా తొలి టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. బుధవారం (జూన్ 25) వెస్టిండీస్ తో తొలి టెస్ట్ కు సిద్ధమైంది. 2025-27 టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి సిరీస్. బలహీనమైన వెస్టిండీస్ ను ఆస్ట్రేలియా చిత్తు చేయాలని భావిస్తుంటే.. స్వదేశంలో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వాలని చూస్తుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆసీస్ కు కమ్మిన్స్ కెప్టెన్ గా కొనసాగనుండగా.. కొత్త కెప్టెన్ రోస్టన్ ఛేజ్ తొలిసారి వెస్టిండీస్ కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు ఇప్పుటికే ప్లేయింగ్ 11 ప్రకటించాయి. 

ఆస్ట్రేలియా తుది జట్టు విషయానికి వస్తే మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, లాబుస్చాగ్నే లేకుండానే విండీస్ తో కంగారూల జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. నాలుగేళ్లుగా ఆసీస్ జట్టులో రెగ్యులర్ గా ఉంటూ ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడిన మార్నస్ పై ఫైనల్ గా సెలక్టర్లు కొరడా ఝులిపించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ (17,22) ల్లో విఫలం కావడంతో అతడిని వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయలేదు. లాబుస్చాగ్నేతో పాటు స్టీవ్ స్మిత్ తొలి టెస్టుకు ఎంపిక కాలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్లో బవుమా క్యాచ్ అందుకునే క్రమంలో స్మిత్ చేతి వేలికి గాయమైంది. దీంతో స్మిత్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు.

►ALSO READ | ENG vs IND 2025: బంగ్లా, పాక్ కన్నా ఘోరం: చివరి 9 టెస్టుల్లో టీమిండియాకు ఒకటే విజయం

ఉస్మాన్ ఖవాజాతో పాటు 19 ఏళ్ళ కుర్రాడు సామ్ కాన్స్టాస్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నాడు. కామెరాన్ గ్రీన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. స్మిత్ స్థానంలో వచ్చిన జోష్ ఇంగ్లిస్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ ఫస్ట్ బౌలర్లుగా కొనసాగనున్నారు. నాథన్ లియాన్ ఏకైక స్పిన్నర్ గా బరిలోకి దిగుతాడు. వెస్టిండీస్ 6 గురు బ్యాటర్లు.. ఒక స్పిన్ ఆల్ రౌండర్.. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్.. ముగ్గురు పేసర్లతో ప్లేయింగ్ 11 ప్రకటించింది. 

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

క్రెయిగ్ బ్రాత్‌వైట్, బ్రాండన్ కింగ్, జాన్ కాంప్‌బెల్, షై హోప్ (వికెట్ కీపర్), కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్(కెప్టెన్), జోమెల్ వారికన్, అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): 

ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్