రాజస్థాన్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన హైదరాబాద్

రాజస్థాన్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన హైదరాబాద్

దుబాయ్: ఐపీఎల్ లో మరో ఫైట్ కు రెడీ అయింది సన్ రైజర్స్ హైదరాబాద్. దుబాయ్ వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది హైదరాబాద్. ఓపెనర్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ సాధించిన జోష్ లో ఉన్న SRH.. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్, బెయిర్ స్టో ఫామ్ లోకి రావడంతో.. ఆ జట్టులో ఉత్సాహం కనిపిస్తోంది. విలియమ్సన్ కూడా ఫర్వాదలేదనిపించాడు. అటు బౌలర్లు కూడా ఫామ్ లోకి రావడం హైదరాబాద్ కు కలిసి వచ్చే అంశం. రషీద్ ఖాన్ తన స్పిన్నింగ్ మాయాజాలంతో వికెట్లు తీయడం.. యార్కర్ల రారాజు నటరాజన్ రెండు వికెట్లు తీసుకోవడంతో పాటు బ్యాట్స్ మెన్ ను పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఆదివారం కూడా అదే ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాలని భావిస్తోంది సన్ రైజర్స్ టీమ్. ఇప్పుటివరకు ఆరు మ్యాచులు ఆడి..మూడింట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది హైదరాబాద్.

రాజస్థాన్ రాయల్స్ ను వరుస ఓటములు బాధిస్తున్నాయి. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్.. మొదటి రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచి.. తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి వీక్ గా కనిపిస్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ స్మిత్ ఫర్వాలేదనిపించినా.. సంజూ శాంసన్ మాత్రం నిరాశపరిచాడు. యశస్వి జైస్వాల్ కూడా ఫర్వాలేదనిపించినా… నిలకడ చూపించడం లేదు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్ ఫామ్ లోకి వచ్చినా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 13రన్స్ తో సరిపెట్టాడు. బౌలింగ్ లో ఆర్చర్ బాగానే రాణిస్తున్నాడు. వికెట్లు తీసినా.. అపోజిట్ టీమ్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో మాత్రం సక్సెస్ కావడం లేదు రాజస్థాన్ బౌలర్లు. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ గా లేకపోవడం.. రాజస్థాన్ రాయల్స్ కు మైనస్ గా ఉంది.