KKR vs SRH: బోణీ కొడుతుందా..టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సన్ రైజర్స్

KKR vs SRH: బోణీ కొడుతుందా..టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సన్ రైజర్స్

ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ తమ తొలి సమరానికి సిద్ధమైంది. పటిష్టమైన కోల్ కతా నైట్ రైడర్స్ తో సీజన్ తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు సీజన్ తొలి మ్యాచ్ కావడంతో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆరాటపడుతున్నారు. కొత్త కెప్టెన్ కమ్మిన్స్ జట్టును ఎలా నడిపిస్తాడో ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేకేఆర్ సొంతగడ్డపై ఆడుతుండడంతో విజయంపై ధీమాగా ఉంది. మరి సీజన్ తొలి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): 

మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి