
సొంతగడ్డపై తొలి రెండుమ్యాచ్ ల్లో అద్భుత విజయాలు సాధించినా .. గతరెండు మ్యాచ్ ల్లో పరాజయం పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టేందుకురెడీ అయింది. ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆదివారం జరిగే పోరులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది . ఓటమితో టోర్నీని ఆరంభించినా .. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆరెంజ్ ఆర్మీ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడి డీలా పడింది . అయితే, సొంత అభిమానులసమక్షంలో ఢిల్లీని మరోసారి ఓడించి గాడిలో పడాలని ఆరాటపడుతోంది. మరోవైపు గెలుపుబాటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లోనూ అదే దూకుడు కనబర్చాలని పట్టుదలగా ఉంది. ఫిరోజ్ షా కోట్లాలో తమను ఓడించిన సన్ రైజర్స్‌వారి హోమ్ గ్రౌండ్ లో ఓడించి ప్రతీకారం తీర్చు కోవాలని శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ పట్టుదలగా ఉంది.
మిడిలార్డర్ సెట్ అయ్యేనా..?
టోర్నీ ఆరంభంలో ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ సెంచరీ భాగస్వామ్యాలతో రెచ్చిపోవడంతో సన్ రైజర్స్ సునాయాస విజయాలు నమోదు చేసింది . అయితే గత రెండు మ్యాచ్ ల్లో వీరిద్దరూ విఫలమవడంతో పాటు మిడిలార్డర్ రాణించకపోవడం జట్టును వేధిస్తోంది. ముఖ్యంగా విజయ్ శంకర్ , మనీశ్ పాండే, దీపక్ హూడా, యూసుఫ్ పఠాన్ లాంటి భారీ హిట్లర్లతో కూడిన మిడిలార్డర్ విఫలమవడం టీమ్ మేనేజ్ మెంట్ ను కలవరపరుస్తోంది. సాధ్యమైనంత త్వరలో వీరు గాడిన పడాలని జట్టు ఆశిస్తోంది . ఇక బౌలింగ్‌లోస్టాండిన్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్, సందీప్‌శర్మ, సిద్ధార్థ్ కౌల్ సత్తా చాటుతున్నారు. అఫ్గా నిస్తాన్ స్పి న్ ఆల్ రౌండర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే కింగ్స్ ఎలెవన్‌పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ విభాగం విఫలమయ్యింది . లోకేశ్ రాహుల్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ హైదరాబాద్ బౌలర్లను ఆటాడుకున్నారు. దీంతో సొంతగడ్డపై జరుగుతున్నఈ మ్యాచ్ లో తడాఖా చూపి మళ్లీ గెలుపు బాటపట్టాలని టీమ్ మేనేజ్ మెంట్ కోరుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ బరిలోకి దిగే అవకాశముంది . గాయం నుంచి కోలుకున్న కేన్ ఫిట్ నెస్ సాధించాడని సన్ రైజర్స్‌కోచ్ టా మ్ మూడీ తెలిపాడు. అయితే, అతను తుది జట్టులోకి రావాలంటే టీమ్ కాంబినేషన్ ను మార్చాల్సి ఉంటుంది . విదేశీ ప్లేయర్ల కోటాలో బెయిర్ స్టో, వార్నర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ ఇప్పటికే కుదురుకున్నారు. కేన్ రావాలంటే వీరిలోఎవరో ఒకరినీ తప్పించాల్సిందే. అదే జరిగితే టీమ్ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం కూడాకనిపిస్తోంది . దీనిపై మేనేజ్ మెంట్ ఏ నిర్ణయంతీసుకుంటుందో చూడాలి.
అందరి దృష్టి ధావన్ పైనే
కోల్ కతా నైట్ రైడర్స్ పై అర్ధ సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రపంచకప్ కు ముందు తను ఫామ్ లోకి రావడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనడంలోఎలాంటి సందేహం లేదు. మరోవైపు వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ అదేజోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది.ముఖ్యంగా రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కత నైట్ రైడర్స్ పై సునాయాస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎగబాకింది. గత మ్యాచ్ లో తురుపుముక్క రిషబ్ పంత్ బాధ్యాయుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ధవన్ తో కలిసి 105 పరుగులు జోడించడంతో జట్టు అలవోక విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ , పృథ్వీషాలు తమ బ్యాట్ కు పదునుపెట్టాల్సి ఉంది. బౌలింగ్‌లో కగిసో రబాడ,క్రిస్ మోరిస్ , ఇషాంత్ శర్మ ఆకట్టుకుం టున్నారు.మొత్తంమీద తన విజయ పరంపరను ఇలాగే కొనసాగించాలని టీమ్ మేనేజ్ మెంట్ ఆశిస్తోంది .
జట్లు (అంచనా)
సన్ రైజర్స్ హైదరాబాద్ : భువనేశ్వర్ (కెప్టెన్ ),బెయిర్ స్టో, వా ర్నర్ , శంకర్ , యూసుఫ్ , పాం డే,హుడా, నబీ, రషీద్ , కౌల్ , సందీప్ .ఢిల్లీ క్ యాపిటల్స్ : శ్రేయస్ (కెప్టెన్ ), పృథ్వీ, ధావన్ ,పంత్ , ఇంగ్రామ్ , అక్షర్ పటేల్ , రబాడ, మోరిస్ ,కీమో పాల్ , తెవాటియా, ఇషాం త్ .