
ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్తగా బరిలోకి దిగబోతుంది. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ లో కొత్త జెర్సీతో ఆడబోతుంది. తమ అభిమానులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసిన జెర్సీని సన్ రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కొత్త జెర్సీలో ప్లేయర్లు అదిరిపోయారు. మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ కొత్త జెర్సీలు ధరించి నటించారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ...ఇది మన ఆరెంజ్ ఆర్మీ సరికొత్త జెర్సీ అంటూ కామెంట్ చేసింది.
జెర్సీ ఎలా ఉందంటే..?
సన్ రైజర్స్ పాత జెర్సీలో మార్పులు చేయలేదు. అయితే సౌతాఫ్రికా20 లీగ్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జెర్సీని పోలినట్టుగా ఆరెంజ్ జెర్సీపై నల్లరంగును అద్దింది. భుజాలపై నల్లని చారలతో జెర్సీని తయారు చేయించింది. కొత్త జెర్సీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ లోగో, టాటా ఐపీఎల్ లోగోలు ఉన్నాయి.
కొత్త జెర్సీకి కొత్త కెప్టెన్..
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగబోతుంది. సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్‌కు సారథయ బాధ్యతలు అప్పగించింది. సౌతాఫ్రికా -20 లీగ్‌లో ఈస్టర్న్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ అందించిన మార్కరమ్ కు జట్టు మేనేజ్ మెంట్ కెప్టెన్సీ అప్పగించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్
మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్రమ్,గ్లెన్ ఫిలిప్స్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సంవీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మే ఉపేంద్ర యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకేల్ హోసేన్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్,ఫజల్హాక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి