LSG vs SRH: లక్నోకి చావో రేవో.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

LSG vs SRH: లక్నోకి చావో రేవో.. టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జయింట్స్ కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడిన ఆ జట్టు సోమవారం (మే 19) సన్ రైజర్స్ హైదరాబాద్ తో చావో రేవో మ్యాచ్ లో తలబడుతుంది. లక్నో వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు గెలిచిన పంత్ సేన..ఈ మ్యాచ్ లో ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి లక్నోకు షాక్ ఇవ్వాలని చూస్తోంది.  

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కే

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): 

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ