
న్యూఢిల్లీ: తనను కెప్టెన్సీ నుంచి తొలగించడానికి గల కారణాలను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకు చెప్పలేదని స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఆరోపించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉందన్నాడు. ‘ఫ్రాంచైజీ ఓనర్స్, ట్రేవర్ బేలిస్, లక్ష్మణ్, మూడీ, మురళీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఓ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆమోదయోగ్యంగా ఉండాలి. నా విషయంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారో, ఎందుకు తీసుకున్నారో ఇప్పటివరకు రీజన్స్ తెలియవు. కనీసం వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం నన్ను మరింత నిరాశకు గురి చేసింది. ఒక ఫ్రాంచైజీ తరఫున వంద మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్.. నాలుగు మ్యాచ్‌ల్లో సరిగా ఆడకపోయినంత మాత్రానా కెప్టెన్సీ తీసేస్తారా?’ అని వార్నర్ ప్రశ్నించాడు. దీనికి సరైన సమాధానాలు ఎప్పటికీ లభించవన్నాడు.