నేడే.. రాజస్థాన్ తో సన్ రైజర్స్ మ్యాచ్

నేడే.. రాజస్థాన్ తో సన్ రైజర్స్ మ్యాచ్

వెలుగు: తొలి మ్యాచ్​లోత్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న సన్ రైజర్స్​ హైదరాబాద్ సొంతగడ్డపై బోణీకొట్టేందుకు రెడీ అయింది. ఉప్పల్‌ రాజీవ్గాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగే తొలిహోమ్ ​మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​తో తలపడనుంది. కోల్‌ కతాతో మ్యాచ్ లో వార్నర్​ చెలరేగిఆడినా.. బౌలింగ్​ వైఫల్యంతో విజయం చేజార్చుకున్న హైదరాబాద్ సొంతగడ్డపై సమష్టిగా ఆడి విజయంసాధించాలని చూస్తోంది. మరోవైపు ‘మన్కడింగ్’వివాదాన్ని మరచి గెలుపు రుచి చూడాలని రాజస్థాన్ కూడా భావిస్తోంది. ఇక బాల్​ టాంపరింగ్​ నిషేధం తొలిగిన తర్వాత ఐపీఎల్​లో బరిలోకి దిగిన డేవిడ్​ వార్నర్, అతని ఆస్ట్రేలియా సహచరుడు స్టీవ్ స్మిత్ పై ఈ మ్యాచ్​లో అందరిదృష్టి నిలవనుంది. గాయం కారణంగా తొలిమ్యాచ్​కు దూరమైన కెప్టెన్ కేన్ విలి యమ్ రాక ఇంకా డౌటే. హైదరాబాద్ లో అతను రెండురోజులు ప్రాక్టీస్​ చేశాడు. అయితే, కేన్‌‌ ఆడేది లేనిది శుక్రవారమే నిర్ణయిస్తామని కోచ్​ టామ్​మూడీ తెలిపాడు. ఐపీఎల్​లో అత్యంత పదునైన బౌలింగ్​సన్ రైజర్స్​దే.సొంతగడ్డపై మన బౌలర్లు మరింత చెలరేగుతారు.అయితే, ఫస్ట్ మ్యాచ్ డెత్ ఓవర్లలో విఫలమై మ్యాచ్​ను చేజార్చుకోవడం ఆందోళన కలిగించే అంశం. భువీకూడా ఆండ్రీ రసెల్​ను అడ్డుకోలేక పోయాడు

రాజస్థాన్ పటిష్టంగానే..
మరోవైపు రాజస్థాన్ రాయల్స్​ కూడా బలంగా కనిపిస్తోంది. గత సీజన్ లో అద్భుతంగా ఆడిన బట్లర్​ ఫామ్​ ఆ టీమ్​కు సానుకూలాంశం. పంజాబ్ పై బట్లర్​తో పాటు రహానె, శాంసన్, స్మిత్ కూడా బాగానే ఆడారు. వార్నర్​ తొలి మ్యాచ్​తోనే ఫామ్​లోకి వచ్చిన నేపథ్యంలో ఈ పోరులో సత్తా చాటి తాను కూడా జోరందుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. బెన్ స్టోక్స్​, రాహుల్​ త్రిపాఠి,కృష్ణప్ప గౌతమ్​ కూడా బ్యాట్ తో సత్తా చాటగలరు.అందువల్ల ఆతిథ్య బౌలర్లు ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్న మూల్యం చెల్లిం చుకోక తప్పదు.