Oye Re Release: ఓయ్ రీ రిలీజ్ ట్రెండ్..లేడీ ఫ్యాన్ మెస్మరైజింగ్ స్టెప్పులు

Oye Re Release: ఓయ్ రీ రిలీజ్ ట్రెండ్..లేడీ ఫ్యాన్ మెస్మరైజింగ్ స్టెప్పులు

సిద్దార్ధ్ నటించిన ఓయ్(Oy) సినిమా రీ రిలీజ్ ట్రెండ్ మాములుగా లేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్న వాలంటైన్స్ డే స్పెషల్గా  రిలీజ్ కావడంతో ఆడియన్స్ థియేటర్స్లో ఫుల్ ఎంటర్ టైన్ అయ్యారు. చాలా చోట్ల షోలు ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా పాటలకు ఆడియన్స్ ప్రేమ అనే కొత్త లోకంలోకి వెళ్లారు. 

ఈ మూవీలో వచ్చే ప్రతిపాటకు ఎవ్వరి స్టైల్లో వారు తమ ఫేవరేట్ సాంగ్స్కు డ్యాన్స్ చేశారు. లేటెస్ట్గా ఓ లేడీ ఫ్యాన్ 'అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని' అనే సాంగ్కి క్యూట్ మెస్మరైజింగ్ స్టెప్పులతో అదరగొట్టింది. తాను పాటకు సరిపోయే అందాన్ని..లిరిక్స్కు చూపించాల్సిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ని  తన డ్యాన్స్ లో చూపించింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో యూత్ కి తెగ నచ్చుతుంది. యువన్ శంకర్ రాజా ఇచ్చిన పాటలు ఈ చిత్రానికి మరింత ఫీల్‍ను యాడ్ చేశాయి.ఓయ్ రీ రిలీజ్ థియేటర్లలో ప్రేక్షకులు కూడా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. 

ఓయ్ రీ-రిలీజ్‍కు వస్తున్న అద్భుతమైనరెస్పాన్స్కు ఈ మూవీ నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్ కూడా స్పందిస్తోంది. ట్విట్టర్లో ఫ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేయడంతో పాటు కొన్నింటికి రిప్లే ఇస్తూ ఫుల్ యాక్టివ్‍గా ఉంది.

సిద్దార్ధ్ కెరీర్ లోనే క్లాసిక్ బ్లాక్ బాస్టర్గా ఓయ్ నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.40కోట్ల పైగా కలెక్షన్స్ సాధించింది. ఓయ్ మూవీకి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు.