50 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా మూవీ చేసిన కృష్ణ

50 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా మూవీ చేసిన కృష్ణ

తెలుగు ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన హీరో కృష్ణ. ప్రయోగాలకు ఎప్పుడూ ఆయన ముందే ఉంటారు. కేవలం హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన కౌబాయ్ తరహా చిత్రాలను టాలీవుడ్ కు పరిచయం చేసిన  ఘనత ఆయనకే  దక్కుతుంది. ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటున్న పాన్ ఇండియా మూవీని ఆయన 50 ఏళ్ల క్రితమే చేశారు. ఇంగ్లీష్ సినిమాల స్ఫూర్తితో 1971లో  మోసగాళ్ళకు మోసగాడు అనే  సినిమాను రూపొందించారు. 

ఈ సినిమా తమిళ్ తో పాటుగా   హిందీలో ‘ఖజానా’, ఇంగ్లీష్ లో ‘ది ట్రెజర్’ టైటిళ్లతో  రిలీజై సూపర్ హిట్అయింది. అప్పట్లోనే 125 దేశాల్లో రిలీజైన తొలి భారతీయ సినిమాగా మోసగాళ్లకు మోసగాడు రికార్డు క్రియేట్ చేసింది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో  కృష్ణ సరసన  విజయనిర్మల హీరోయిన్ గా నటించారు. పద్మాలయా స్టూడియోస్ పై ఆదిశేషగిరిరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ సినిమాతో కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆంధ్రా జేమ్స్‌బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు.