వచ్చే నెలలో మహేష్ - త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్

వచ్చే నెలలో మహేష్ - త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో కొత్త చిత్రం రాబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ అగస్ట్ నుండి ప్రారంభంకానుంది. దీనిని చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా ప్రకటించింది. 2023లో రిలీజ్ కానున్న ఈ మూవీలో మహేష్ తో పూజాహెగ్డే మరోసారి జతకడుతోంది.  మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్ గా, పిఎస్.వినోద్ కెమెరామెన్ గా, తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

అతడు, ఖలేజా తర్వాత మహేష్,త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సుమారు 12ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేష‌న్‌ రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత ఎస్.రాధా కృష్ణ  తెలిపారు.