Rajinikanth Coolie: ఇదికదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. కూలీ కోసం టాప్ రెమ్యునరేషన్

Rajinikanth Coolie: ఇదికదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. కూలీ కోసం టాప్ రెమ్యునరేషన్

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలి(Coolie). తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ఈ సినిమా చాలా కాలం క్రితమే లాంఛనంగా ప్రారంభమైంది. కానీ, రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలవలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ ఆడియన్స్ లో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఇక టీజర్ లో రజిని వింటేజ్ లుక్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. శ్రుతీ హాసన్ ఈ సినిమాలో రజినీకాంత్ కూతురిగా కనిపించనుందట.

తాజాగా ఈ సినిమా నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం రజిని టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కుగాను రజినికి దాదాపు రూ.260 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా ఇస్తున్నారట. ఇప్పటివరకు ఇండియాలో తీసుకున్న రెమ్యునరేషన్ లో ఇదే హైయెస్ట్ కావడం విశేషం. ఇక దర్శకుడు లోకేష్ కూడా రూ.60 కోట్ల రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఈ ఇద్దరు స్టార్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇది కదా తలైవర్ క్రేజ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున