Nagarjuna In Kubera: కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున

Nagarjuna In Kubera: కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున

ఇటీవలే నాసామి రంగ(NaaSaami ranga) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున(Nagarjuna) ప్రస్తుతం కుబేర(Kubera) సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. సన్సిటీవ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ ధనుష్(Danush) ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నుండి నాగార్జున చేస్తున్న పాత్ర గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అదేంటంటే.. కుబేర సినిమాలో నాగార్జున పోలీసు పాత్రలో కనిపించనున్నాడట. అది కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారట దర్శకుడు శేఖర్ కమ్ముల. రోడ్లపై బికారిగా తిరిగే హీరో.. కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగాడు? అతనితో నాగ్ ఎం చేశాడు అనే ఇంట్రెసింగ్ కథతో కుబేర సినిమా రానుంది. ఇక దాదాపు ఆరేళ్ళ తరువాత పోలీసు పాత్రలో కనిపించనున్నాడు నాగార్జున. 

ఆయన చివరగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆఫీసర్ సినిమాలో కాప్ పాత్రలో కనిపించాడు నాగ్. 2018లో వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత కుబేర సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నారు నాగార్జున. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.