
ఆదిలాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పోలీస్క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. విజేతగా సూపర్ స్ట్రైకర్స్ జట్టు, రన్నరప్ గా ఆదిలాబాద్ రాయల్స్ జట్టు నిలిచాయి. ఎస్పీ అఖిల్ మహాజన్ విజేతలకు ట్రోఫీ అందజేశారు.
క్రీడలు శారీరకంగా, మానసికంగా ఉత్తేజాన్నిస్తాయని తెలిపారు. ఏఎస్పీలు సురేందర్ రావు, కాజల్ సింగ్, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్ రెడ్డి, నాగేందర్, ఇంద్రవర్ధన్, పట్టణ సీఐలు, రిజర్వ్ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.