OTT Thriller: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్.. ఇంట్లో దెయ్యాలతో పెళ్ళైన కొత్త జంట

OTT Thriller: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్.. ఇంట్లో దెయ్యాలతో పెళ్ళైన కొత్త జంట

తమిళ లేటెస్ట్ సూపర్ నేచురల్ హారర్ కామెడీ థ్రిల్లర్ హౌస్‌‌మేట్స్ (HouseMates). సెప్టెంబర్ 19న జీ5 ఓటీటీకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. రహస్య సంఘటనలు, దెయ్యాలాడే ఆటలతో మూవీ ఇంట్రెస్టింగ్ లైన్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇందులో దర్శన్, అర్ష చంద్ని బైజు, కాళి వెంకట్, వినోధిని వైద్యనాథన్ తదితరులు నటించారు. డైరెక్టర్ రాజవేల్ నేచురల్ స్టోరీ లైన్కి, థ్రిల్ ఇచ్చే సీన్స్ రాసుకుని కట్టిపడేశాడు. ఈ క్రమంలో మూవీ చూసేందుకు ఓటీటీ ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇవాళ (సెప్టెంబర్ 23న) మేకర్స్ పోస్ట్ చేస్తూ.. ‘‘హౌస్ మేట్స్ 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను దాటింది. డబుల్ ది డ్రామా, డబుల్ ది లవ్! బ్లాక్‌బస్టర్ ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హౌస్ మెట్స్ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోందని’’ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే, ఈ మూవీ ఆగస్టు 1న థియేటర్లలలో విడుదలై ఆడియన్స్ని మెప్పించింది. హీరో శివ కార్తికేయన్ ఈ మూవీని నిర్మించి, సక్సెస్ అందుకున్నారు.

కథేంటంటే: 

అను (ఆర్ష చాందిని బైజు), కార్తీక్ (దర్శన్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. అను వాళ్ల నాన్నని పెండ్లికి ఒప్పించేందుకు రూ.45 లక్షలు ఖర్చు చేసి ఆమె పేరు మీద ఒక ఫ్లాట్‌‌ కొంటాడు కార్తీక్‌‌. ఆ తర్వాత ఇద్దరూ పెండ్లి చేసుకుని ఆ ఫ్లాట్‌‌లోనే ఉంటారు. కానీ.. ఆ ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతుండడం అను గమనిస్తుంది.

ఆ విషయం కార్తీక్‌‌కు చెప్తే.. అతను అవన్నీ యాదృచ్చికంగా జరుగుతున్నాయని కొట్టిపారేస్తాడు. మరోవైపు అలాంటి వింత సంఘటనలే  మరో ఇంట్లో ఒక పిల్లవాడిని భయపెడుతుంటాయి. అతని తల్లిదండ్రులు రమేష్ (కాళి వెంకట్), విజి (వినోదిని వైద్యనాథన్) కూడా వాటిని కొట్టిపారేస్తుంటారు.

చివరకు ఒక గోడ ద్వారా ఈ రెండు కుటుంబాల వాళ్లు మాట్లాడుకుంటారు. అప్పుడే ఈ రెండు ఇళ్లలో జరుగుతున్న సంఘటనలకు ఏదో తెలియని సంబంధం ఉందని వాళ్లు తెలుసుకుంటారు. ఆ సంబంధం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.