ఎన్టీఆర్, ఏఎన్నార్లతో కృష్ణ మల్టీస్టారర్ మూవీస్

ఎన్టీఆర్, ఏఎన్నార్లతో కృష్ణ మల్టీస్టారర్ మూవీస్

తెలుగు సినీ చరిత్రలో కృష్ణ ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు తీయడంతోపాటు స్టూడియా నిర్మించి.. ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. భారతీయ సినిమా రంగంలో లెజెండ్ అనిపించుకున్నాడు. సింగిల్గానే కాకుండా ఇతర హీరోలతో కలిసి ప్రేక్షకులను అలరించాడు కృష్ణ. ఆయన ఏ ఏ హీరోలతో నటించారంటే..

కృష్ణ తన తొలి మల్టీస్టారర్ కాంతారావుతో కలిసి నటించాడు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘ఇద్దరు మొనగాళ్లు’. కాంతారావుతో కృష్ణ మొత్తం 3సినిమాల్లో కలిసి నటించారు. కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన నటుడిగా కృష్ణంరాజు నిలిచారు. వీరు 19 సినిమాల్లో కలిసి నటించారు.  

ఏఎన్నార్ తో

కృష్ణ అక్కినేని నాగేశ్వరరావును చూసి హీరో కావాలని అనుకున్నాడట. దేవదాసు సినిమా 100 రోజుల పండుగకు ఏఎన్నార్, సావిత్రి తెనాలికి రాగా.. వారిని చూసేందుకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. అది చూసిన కృష్ణకు తాను అలాంటి గౌరవం పొందాలన్న కోరికతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ..సూపర్ స్టార్ అయ్యారు. అక్కినేనితో కలిసి మంచి కుటుంబం, అక్కా చెల్లెలు,హేమాహేమీలు, గురుశిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయ చదరంగం సినిమాల్లో నటించారు. 

ఎన్టీఆర్ తో 

ఎన్టీఆర్ తో కలిసి కృష్ణ 5 సినిమాల్లో నటించారు.ఎన్టీఆర్ తో కలిసి నటించిన తొలి చిత్రం స్ట్రీ జన్మ. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో నిలువుదోపిడి, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు, వగలమారి భర్తలు  వంటి సినిమాలు వచ్చాయి. ఈ ఐదు మూవీల్లోనూ వీరు బ్రదర్స్ గా నటించడం విశేషం

అంతేకాకుండా శోభన్ బాబుతో 13, మోహన్ బాబుతో 4, శివాజీ గణేశన్తో 3, రజినీకాంత్ తో 3, సుమన్తో 3, నాగార్జున తో 2, చిరంజీవి, బాలకృష్ణ, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమాలో శారు.మహేష్ బాబుతో 7, రమేష్ బాబుతో 5 సినిమాల్లో నటించారు.