
సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. ‘‘ కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని ట్వీట్ చేశారు.
కృష్ణ మరణవార్త విషయం నన్నెంతో బాధించింది : రాహుల్‌గాంధీ
తెలుగు సినిమా సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణాజీ మరణవార్త విషయం నన్నెంతో బాధించింది. వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధత, విలువలు ప్రజలకు ఆదర్శం. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.