Mahesh Babu: కంగ్రాట్స్‌ నిహారిక..మహేశ్‌బాబుకు నచ్చేసిన కమిటీ కుర్రోళ్ళు..త్వరలో సినిమా చూస్తా

Mahesh Babu: కంగ్రాట్స్‌ నిహారిక..మహేశ్‌బాబుకు నచ్చేసిన కమిటీ కుర్రోళ్ళు..త్వరలో సినిమా చూస్తా

మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్ పై నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు(CommitteeKurrollu). ఈ క‌మిటీ కుర్రోళ్ళు సినిమాతో ఏకంగా ప‌ద‌కొండు మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్ల‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తోంది నిహారిక. ఆగస్ట్ 9న క‌మిటీ కుర్రోళ్ళు సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కించిన క‌మిటీ కుర్రోళ్ల జాతరకు సినీ ఆడియన్స్ తో పాటుగా సినిమా స్టార్స్ కూడా ఫిదా అవుతున్నారు.

Also Read:-ఇండిపెండెన్స్ డేకి థియేటర్స్‌లో వస్తోన్న క్రేజీ సినిమాలు..వాటి సెన్సార్స్

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కమిటీ కుర్రోళ్లు సినిమాని నిర్మించిన నిహారికకు అభినందనలు తెలిపారు. "కమిటీ కుర్రోళ్ళు గురించి చాలా మంచి గొప్ప విషయాలు వింటున్నా. సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్‌ నిహారిక. త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తా" అని ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టార్ హీరో స్పందించినందుకు సినీ సర్కిల్ లో కమిటీ కుర్రోళ్ళు అందరికీ నచ్చేస్తున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా మహేష్ వంటి  స్టార్ హీరో చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తు పోస్ట్ చేసినందుకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే "థాంక్యూ సూపర్‌స్టార్ మహేష్ గారు..మీరు మా కమిటీ కుర్రోళ్లు చూసే వరకు మేము వేచి ఉండలేము" అంటూ మేకర్స్ తెలిపారు 

ఈ సినిమా అచ్చ‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి క‌థ‌. అంటే మన కథ. ప‌ల్లెటూళ్ల‌లో క‌ల్మ‌షం లేని మ‌నుషులు, వారి స్నేహాలు..అక్క‌డి రాజ‌కీయాలు ఎలా ఉంటాయ‌న్న‌ది డైరెక్టర్ య‌దు వంశీ చాలా సహజ సిద్ధంగా చూపించారు. ఇలాంటి కథలు ప్రతిఒక్కరి జీవితంలో జరిగేవే. అందుకే కథ కోసం వెతికే పనుండదు. కమిటీ కుర్రోళ్ళు నుంచి మొదట రిలీజైన విజువల్స్, మొన్న రిలీజైన ట్రైలర్ వరకు పాజిటివ్ వైబ్ కనిపించింది.

సినిమా చూసిన ప్రేక్షకుడికి కూడా అంతే పాజిటివ్ వైబ్ వస్తుంది. ఈ క‌మిటీ కుర్రోళ్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఓ సినిమాలా కాకుండా సహజ సిద్దమైన ప‌ల్లె వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల ముందు తీసుకొచ్చి..ఆడియన్స్ కు ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను క‌లిగించాడు డైరెక్టర్.ఈ సినిమా కథ, కథనం సాంకేతికత అభివృద్ధి చెందని సమయంలో పల్లెటూరిలో పిల్ల‌ల మ‌ధ్య స్నేహాలు ఎలా ఉండేవి..కుల‌మ‌తాలకు అతీతంగా ఎలా క‌లిసిమెల‌సి జీవించే వాళ్లు అన్న‌ది మ‌న‌సుల‌కు హ‌త్తుకునేలా దర్శకుడు యదు వంశీ.

ఈ రూర‌ల్ కామెడీ డ్రామాలో అంత‌ర్లీనంగా రిజ‌ర్వేష‌న్ల కు సంబంధించిన ఓ ఇష్యూను ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా డైరెక్టర్ ట‌చ్ చేయ‌డం చాలా ఇంప్రెస్స్ గా ఉంది. ప్ర‌తిభ ఉండి చ‌దువుకు కొంద‌రు ఎలా దూరం అవుతున్నార‌నే అంశాన్ని కళ్ళకు కట్టినట్లుగా  ఆవిష్క‌రించాడు. ఆ పాయింట్‌తోనే స్నేహితుల మ‌ధ్య దూరం పెర‌గ‌డం..ఊర్లో రాజకీయం ఇలా ప్రతి ఒక్క ఎమోషన్ ను..డైరెక్టర్ రాసుకున్న తీరు ఆక‌ట్టుకుంటుంది. ఏదో యూత్ ఫుల్ సినిమా తీసాం అన్నట్టు కాకుండా..రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూ గురించి మాట్లాడుకోవడం బాగుంది.