సీఎం యోగీ కాళ్లు మొక్కిన రజినీకాంత్

సీఎం యోగీ కాళ్లు మొక్కిన రజినీకాంత్

ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. శుక్రవారం లక్నోలో ఈ సినిమాను ప్రదర్శించారు. అనంతరం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యా నాథ్ ను కలిసేందుకు రజనీకాంత్ ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రజనీకాంత్ సీఎం యోగి పాదాలను తాకి అభివాదం చేశారు. అనంతరం ఇద్దరు కలిసి ఫొటోలు దిగారు.  

రజినీకాంత్ అంటే సూపర్ స్టార్.. ఆయన వయస్సు ఏమీ తక్కువ కాదు.. 72 ఏళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరి ముందు తల వంచలేదు.. గౌరవంగానే తల వంచారు తప్పితే.. ఇప్పుడు ఏకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కారు. యోగీ వయస్సు 51 ఏళ్లు మాత్రమే. వయస్సు రీత్యా యోగీ కంటే రజినీకాంత్ 20 ఏళ్లు పెద్ద.. అయినా కూడా..  సూపర్ స్టార్ రజినీకాంత్ యోగీ కాళ్లకు మొక్కటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. 

జైలర్ మూవీని.. యూపీ రాజధాని లక్నోలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ షోను సీఎం యోగీ కూడా వచ్చి చూశారు. ఈ సందర్భంగానే యోగీ ఇంటికి వెళ్లిన రజినీకాంత్ ను.. ఇంటి గుమ్మం దగ్గరే రజినీకాంత్ ను స్వయంగా ఆహ్వానించారు యోగీ. కారు దిగి వెళ్లిన రజినీకాంత్.. యోగీ కాళ్లకు దండం పెట్టారు. యోగీ సైతం అభివాదం చేశారు. సందర్భం ఏదైనా.. సూపర్ స్టార్ రజినీకాంత్.. యూపనీ సీఎం కాళ్లు మొక్కటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడు నెటిజన్లు అయితే భిన్నంగా స్పందిస్తున్నారు.