రజినీకాంత్ గవర్నర్ కాబోతున్నారా.. తమ్ముడు కూడా ఖండించలేదు..?

రజినీకాంత్ గవర్నర్ కాబోతున్నారా.. తమ్ముడు కూడా ఖండించలేదు..?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినిమా జైలర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. నెల రోజుల నుంచి జైలర్ హవా కంటిన్యూ గా నడుస్తుంది. ఇక లేటెస్ట్గా రజినీకాంత్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. త్వరలో రజినీకాంత్కు గవర్నర్ పదవి దక్కనుందని సమాచారం.

ఇటీవల రజినీ హిమాలయాలకు వెళ్లారు. పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లొచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్య నాధ్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో పాటు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో భేటీ అయ్యారు. యూపీ సీఎం యోగీ కాళ్లకు అయితే ఏకంగా దండం పెట్టారు. జైలర్ మూవీ తర్వాత బీజేపీ పెద్దలతో బాగా టచ్ లోకి వెళ్లారు రజినీకాంత్. దీనికితోడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న రజినీ బీజేపీకి మొదటి నుంచి దగ్గరగానే ఉన్నారు. దీంతో కేంద్రం త్వరలో గవర్నర్ పదవి ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదే అంశంపై ర‌జినీ సోద‌రుడు స‌త్య‌నారాయ‌ణ రావు స్పందిస్తూ..ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రారు. ఒకవేళ వస్తే సంతోషిస్తాం. రజినీకి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సర్వీస్ చేయడం ఇష్టమే. ఇక గవర్నర్‌ పదవి అనేది భగవంతుడి చేతుల్లో ఉందని.. గవర్నర్ పదవి వస్తే మంచిదే కదా అంటూ వ్యాఖ్యానించారు దీంతో రజినీకాంత్ కు గవర్నర్ పదవి ఖాయమంటూ ప్రచారం జోరందుకుంది.

ఇక గవర్నర్ పదవిలో రజినీకాంత్ ను చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక కామన్ బస్ కండక్టర్.. సూపర్ స్టార్ అయ్యే వరకు రజినీ లైఫ్ జర్నీ అందరికీ ఆదర్శం.ఇక గవర్నర్ పదవి అనేది రజినీ స్వీకరిస్తాడో  లేదో..చూడాలి మరి. అంతకంటే ముందు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఆ పదవి ఇస్తుందో లేదో కూడా చూడాలి.. కాకపోతే.. ఇటీవల రజినీకాంత్ వరకు బీజేపీ పెద్దలను కలుస్తున్న తీరు చూస్తుంటే మాత్రం.. ఏదో ఒక రాష్ట్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ గవర్నర్ కాబోతున్నారనేది తమిళనాడు రాష్ట్రంలో బాగా ప్రచారం అవుతుంది.