రోడ్లెక్కిన సపోర్టర్స్​.. ఇండ్లపైకి రాళ్లు విసిరి.. వాహనాలకు నిప్పు పెట్టిన నిరసనకారులు

రోడ్లెక్కిన సపోర్టర్స్​.. ఇండ్లపైకి రాళ్లు విసిరి.. వాహనాలకు నిప్పు పెట్టిన నిరసనకారులు

రోడ్లెక్కిన సపోర్టర్స్​

ఇటు ట్రంప్ వర్గం.. అటు బైడెన్ వర్గం పోటా పోటీ ఆందోళనలు

ఆరిజోనా, న్యూయార్క్​ సహా పలుచోట్ల ఉద్రిక్తత
ఇండ్లపైకి రాళ్లు విసిరి.. వాహనాలకు నిప్పు పెట్టిన నిరసనకారులు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రిజల్ట్స్​ అగ్గిరాజేస్తున్నాయి. ఇటు డొనాల్డ్​ ట్రంప్​ వర్గం.. అటు జో బైడెన్​ వర్గం పోటా పోటీ నిరసనలతో మెయిన్​ సిటీలు అట్టుడుకుతున్నాయి. పోలింగ్​లో, కౌంటింగ్​లో డెమొక్రాట్స్​ అక్రమాలకు పాల్పడ్డారని, ప్రతి ఓటునూ కౌంట్​ చేయాల్సిందేనంటూ ఆరిజోనాలో  రిపబ్లికన్​ పార్టీ సపోర్టర్స్​ ఆందోళనలకు దిగారు. ట్రంప్​ తీరును నిరసిస్తూ న్యూయార్క్​, మిషిగాన్​ వంటి చోట్ల బైడెన్​ సపోర్టర్స్​ ర్యాలీలు చేపట్టారు. కొన్ని చోట్ల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

ఆయుధాలతో కౌంటింగ్​ సెంటర్​కు..

లక్షలాది ఓట్లను లెక్కించకుండానే బైడెన్​కు ఆరిజోనాలోని 11 ఎలక్టోరల్​ ఓట్లు ఎలా వేస్తారంటూ బుధవారం రాత్రి వందల మంది ట్రంప్​ సపోర్టర్స్​ ఆయుధాలతో మేరీకోపా కౌంటింగ్​ సెంటర్​కు  చేరుకున్నారు. ఆరిజోనాలో 50.5 శాతం ఓట్లతో ముందు వరుసలో బైడెన్​ ఉండగా.. ట్రంప్​ 48.1 శాతం ఓట్లు సాధించారు. ముందు వరుసలో ఉన్న బైడెన్​   గెలిచినట్లు వార్తలు వచ్చాయి.  బైడెన్​ 60 వేల ఓట్లతో ఫస్ట్​ ప్లేస్​లో ఉండగా.. ఇంకా లెక్కించాల్సిన 2.5 లక్షల ఓట్లతో ఫలితం ట్రంప్​కు అనుకూలంగా రావొచ్చని, అన్ని బ్యాలెట్స్​ను లెక్కించాల్సిందేనంటూ రిపబ్లికన్స్​ ఆందోళనలకు దిగారు. డెమొక్రాట్స్​ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.  మరోవైపు మిచిగాన్​లో ఓట్ల లెక్కింపును ఆపాలంటూ మొదటి నుంచి ట్రంప్​ వర్గం పట్టుబడుతున్నది. ఇక్కడ  99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో లీడ్​లో ఉన్న బైడెన్​ను గెలిచినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. బైడెన్​కు ట్రంప్​కు మధ్య మిషిగాన్​లో  2.7 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. కౌంటింగ్​లో అక్రమాలు జరిగాయని, రీ కౌంటింగ్​ చేయాల్సిందేనని ట్రంప్​ వర్గం డిమాండ్​ చేసింది. విస్కాన్సిన్​లోనూ ఇదే తరహాలో రిపబ్లికన్స్​ రోడ్లమీదికి వచ్చి ట్రంప్​కు అనుకూలంగా.. బైడెన్​కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులతో ప్రదర్శనలు చేపట్టారు.

ర్యాలీలతో టెన్షన్​.. టెన్షన్​

పూర్తి ఫలితాలు తేలకముందే తానే గెలిచినట్లు ట్రంప్​ ప్రకటించుకోవడాన్ని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ న్యాయ పోరాటం చేయడాన్ని  నిరసిస్తూ  బైడెన్​ సపోర్టర్స్​ పలు స్టేట్స్​లో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ట్రంప్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారని  మండిపడ్డారు. న్యూయార్క్​ సిటీ, ఫిలాడల్ఫి​యా, లాస్​ ఏంజెల్స్​, మిషిగన్​, వాషింగ్టన్, డెట్రాయిట్​, సియాటెల్​ లో  ర్యాలీలు  నిర్వహించారు.  కొందరు ఇండ్లపైకి రాళ్లు విసిరారు. రోడ్ల మీద వాహనాలను తగులబెట్టారు. ఆధిక్యంలో బైడెన్​ ఉన్నారని, ఆయనే అమెరికా అధ్యక్షుడని నినాదాలు చేశారు. తమకు అనుకూలంగా రాని ప్రాంతాల్లో  రీ కౌంటింగ్​ చేపట్టాలని ట్రంప్​ వర్గం పట్టుబడుతోందని మండిపడ్డారు.  భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుపై ఉమ్మేసిన ఇండియన్ ఆరిజిన్ ​యువతి​

న్యూయార్క్​ సిటీలో ట్రంప్​కు వ్యతిరేకంగా డెమొక్రాట్స్​ సపోర్టర్స్​ చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న ఇండియన్​ ఆరిజిన్‌​ యువతి ఒకరు.. పోలీసులను బండ బూతులు తిట్టింది. ఫాసిస్ట్స్​ అంటూ విరుచుకుపడింది. అంతటితో ఆగకుండా ఓ పోలీస్​ ముఖంపై ఉమ్మేసింది. అప్పటివరకు ఓపికగా ఉన్న పోలీసు.. యువతి ఉమ్మివేయగానే అరెస్టు చేశారు. ఆ యువతిని పెన్సిల్వేనియాకు చెందిన 24 ఏండ్ల దేవినా సింగ్​గా గుర్తించారు. విధ్వంసానికి పాల్పడిన మరో 50 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For More News..

7 కోట్ల ఓట్లతో బైడెన్ రికార్డ్

1992 నుంచి రీఎలక్షన్‌లో ఎవరూ ఓడిపోలే

అమెరికాలో గెలిచిన ఆరుగురు భారత మహిళలు