ఆర్టికల్‌‌‌‌ 370 రద్దుపై ఏం చేయాలో మాకు తెలుసు

ఆర్టికల్‌‌‌‌ 370 రద్దుపై ఏం చేయాలో మాకు తెలుసు

    ఇష్యూ కానిస్టిట్యూషన్‌‌‌‌ బెంచ్‌‌‌‌కు  రిఫర్‌‌‌‌ చేసిన కోర్టు

     అక్టోబరు మొదటి వారంలో  విచారణ

ఆర్టికల్‌‌‌‌ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం

జమ్మూకాశ్మీర్‌‌‌‌కు స్పెషల్ స్టేటస్‌‌‌‌ రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన  పలు పిటిషన్లను  ఐదుగురు సభ్యులున్న కానిస్టిట్యూషన్‌‌‌‌ బెంచ్‌‌‌‌కు సుప్రీంకోర్టు బుధవారం రిఫర్‌‌‌‌చేసింది.  ఆర్టికల్‌‌‌‌ 370 రద్దుపై జారీ చేసిన ప్రెసిడెన్షియల్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ను సవాల్‌‌‌‌చేస్తూ దాఖలైన పిటి షన్లపై  కేంద్రానికి,  జమ్మూకాశ్మీర్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌కు  కూడా నోటీసులు జారీచేసింది. అక్టోబరు మొదటి వారంలో పిటిషన్లపై విచారణ జరిపేందుకు వీలుగా లిస్ట్‌‌‌‌ చేస్తామని కోర్టు వెల్లడించింది. ఈ ఇష్యూపై నోటీసులు  జారీచేయాల్సిన అవసరంలేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను బెంచ్‌‌‌‌ అంగీకరించలేదు.

కేంద్రానికి నోటీసులిస్తే దానివల్ల సరిహద్దులో పరోక్ష  ఫలితాలు ఉంటాయని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.  కేంద్ర ప్రభుత్వ  ఆర్గ్యుమెంట్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ రంజన్‌‌‌‌ గొగొయ్‌‌‌‌ ఆధ్వర్యంలోని బెంచ్‌‌‌‌  అంగీకరించలేదు. బెంచ్‌‌‌‌లో చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ గొగొయ్‌‌‌‌ తోపాటు  జస్టిస్‌‌‌‌ ఎస్‌‌‌‌.ఎ. బాబ్డే, జస్టిస్‌‌‌‌ ఎస్‌‌‌‌.ఎ. నజీర్‌‌‌‌ సభ్యులుగా ఉన్నారు.  కేంద్రం తన వాదన వినిపిస్తున్న సమయంలో  అటార్నీ జనరల్‌‌‌‌ కె.కె. వేణుగోపాల్‌‌‌‌, సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ కోర్టులోనే ఉన్నారు. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యులున్న కానిస్టిట్యూషనల్‌‌‌‌ బెంచ్‌‌‌‌కు రిఫర్‌‌‌‌ చేశామని… సీజేఐ బెంచ్‌‌‌‌ స్పష్టంచేసింది. ఈ సమయంలో ఆర్గ్యుమెంట్స్‌‌‌‌, కౌంటర్‌‌‌‌ ఆర్గ్యుమెంట్స్‌‌‌‌ తీవ్రస్థాయిలో జరిగాయి.  ఈసందర్భంగా బెంచ్‌‌‌‌…‘‘ ఏం చేయాలో మాకు తెలుసు.  మేం ఆర్డర్స్‌‌‌‌ పాస్‌‌‌‌ చేశాం.  మళ్లీ మేం వాటిని మార్చం’’ అని క్లారిటీ ఇచ్చింది.

ఎన్నో పిటిషన్లు

370 ఆర్టికల్‌‌‌‌ రద్దుపై జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల్ని చాలెంజ్‌‌‌‌ చేస్తూ మొదటి పిటిషన్‌‌‌‌ను ఆడ్వకేట్‌‌‌‌ ఎం.ఎల్‌‌‌‌.శర్మ సుప్రీంకోర్టులో వేశారు. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్‌‌‌‌కు చెందిన లాయర్‌‌‌‌ షకిర్‌‌‌‌ షాబిర్‌‌‌‌ మరో పిటిషన్‌‌‌‌ వేశారు.

ఏచూరికి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌

సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో సీపీఎం జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరి గురువారం శ్రీనగర్‌ వెళ్లనున్నారు. శ్రీనగర్‌లో నిర్బంధంలో ఉన్న సీపీఎం మాజీ ఎమ్మెల్యే  మహ్మద్ యూసఫ్‌ తరిగామిని   ఆయన కలుస్తారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత   సె తరిగామితోపాటు మరికొందరు నాయకుల్ని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది. డిటెన్షన్‌లో ఉన్న తరిగామికి ఆరోగ్యం దెబ్బతింది.  ఆయనను చూసేందుకు ఏచూరి ఈ మధ్యనే శ్రీనగర్‌ వెళ్లారు. ఆంక్షల కారణంగా పోలీసులు ఎయిర్‌పోర్టు నుంచే ఆయనను వెనక్కి పంపేశారు. దీనిపై  ఏచూరి సుప్రీంకోర్టులో కేసువేశారు. బుధవారం విచారించిన సుప్రీంకోర్టు  కాశ్మీర్‌ వెళ్లేందుకు ఆయనకు అనుమతిచ్చింది.

పిటిషన్లు వేసిన మరికొంతమంది ప్రముఖులు

ప్రొఫెసర్‌‌‌‌ రాధాకుమార్‌‌‌‌,  హైదల్‌‌‌‌ హైదర్‌‌‌‌ త్యాబ్జీ ( జమ్మూకాశ్మీర్‌‌‌‌ కేడర్‌‌‌‌ మాజీ ఐఏఎస్‌‌‌‌) , రిటైర్డ్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ వైస్‌‌‌‌  మార్షల్‌‌‌‌ కపిల్‌‌‌‌ కాక్‌‌‌‌, మేజర్‌‌‌‌ జనరల్‌‌‌‌ (రిటైర్డ్‌‌‌‌) అశోక్‌‌‌‌ కుమార్‌‌‌‌ మెహతా, అమితాబ్ పాండే ( పంజాబ్‌‌‌‌  కేడర్‌‌‌‌ మాజీ ఐఏఎస్‌‌‌‌) , గోపాల్‌‌‌‌ పిళ్లై  (  కేరళ  కేడర్‌‌‌‌ మాజీ ఐఏఎస్‌‌‌‌) , షా ఫాజల్‌‌‌‌ ( మాజీ ఐఏఎస్‌‌‌‌),  జవహర్‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూ స్టూడెంట్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ మాజీ లీడర్‌‌‌‌ షెహ్లా రహీద్‌‌‌‌.