
వరంగల్ రూరల్ జిల్లా: ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామస్తులకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాశారు. గ్రామానికి చెందిన దూడం భాస్కర్ రాసిన లేఖకు బదులిస్తూ.. భాస్కర్ తోపాటు గ్రామస్తులకు ఆయన బదులిచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ లేఖ ప్రమాణం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తిరుమలగిరి గ్రామం తరపున దూడం భాస్కర్ లేఖ రాశారు.
అయితే ఊహించని రీతిలో ఆయన నుండి తిరుగు జవాబు లేఖ రావడంతో గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. సుప్రీంకోర్టు చీఫ్ ఎన్వీ రమణ సంతకంతో గ్రామస్తులు, భాస్కర్ కు ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై లెటర్ రాసి పంపారు. గ్రామస్తులు రాసిన లేఖను చదివానని, అభివృద్ధిలో గ్రామం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ లేఖలో పేర్కొన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వెంకటరమణ. ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇదే...