తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు

తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి 9మంది పేర్లను కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. న్యాయాధికారుల కోటాలో తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ యూ.లలిత్, జస్టిస్ కనిల్కర్ ధర్మాసనం తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జీలుగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం తెలియజేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేసిన విషయం తెలిసిందే. 
ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ హైకోర్టు జడ్జీల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదనకు అంగీకరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇదే క్రమంలో తెలంగాణ హైకోర్టులో జడ్జీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టుకు కొలీజియం సిఫారసు చేసిన కొత్త జడ్జీల పేర్లు:  పి.శ్రీసుధ,సి. సుమలత, డాక్టర్ జి.రాధారాణి, ఎం.లక్ష్మణ్, ఎన్.తుకారామ్ జీ,ఎ. వెంకటేశ్వరరెడ్డి, పి.మాధవీదేవి.