బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మందికి వేసిన జైలు శిక్షను రద్దు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.  క్షమాబిక్ష పెడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వలును కోర్టు కొట్టివేసింది. దోషులకు క్షమాపణలు ఇచ్చే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఆ ఖైదీలకు ఇచ్చిన రెమిషన్‌ ను సుప్రీం కోర్టు కొట్టేవేస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.