సుప్రీంకోర్టులో మీనాక్షి పిటిషన్ డిస్మిస్

సుప్రీంకోర్టులో మీనాక్షి పిటిషన్ డిస్మిస్
  • రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై జోక్యానికి నిరాకరణ
  • బీజేపీ, ఎన్నికల సంఘం నేరంలో భాగస్వాములు: కాంగ్రెస్ 
  • ‘ఫారం 26’లో ప్రైవేట్ ఫిర్యాదుల నమోదుకు కాలమే లేదు 
  • అడగని వివరాలు ఎట్లిస్తరు?: మీనాక్షి  నటరాజన్​
  • కాంగ్రెస్‌‌‌‌లోని అంతర్గత కలహాల వల్లే 
  • రాజ్యసభ అభ్యర్థి ఓటమి: బీజేపీ 

న్యూఢిల్లీ/భోపాల్: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌‌‌‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తెలంగాణలోని ఒక క్రిమినల్ కేసు వివరాలను వెల్లడించలేదని ఆమె రాజ్యసభ నామినేషన్‌‌ను రిటర్నింగ్ అధికారి సంజయ్ శర్మ రద్దు చేయగా, ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి కోర్టు నిరాకరించింది. నామినేషన్ తిరస్కరణ తర్వాత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే ఏకైక మార్గమని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.

నటరాజన్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ.. ఈ కేసులో కేవలం సమన్లు మాత్రమే వచ్చాయని, కనీసం రెండేండ్ల జైలు శిక్ష పడే కేసులనే వెల్లడించాల్సి ఉంటుందని వాదించారు. బీజేపీ అభ్యర్థి మహేశ్​ కేవత్ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈ తిరస్కరణ నిర్ణయం వెలువడింది.

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ'సీటు చోరీ'!: కాంగ్రెస్

ఈ వ్యవహారంలో బీజేపీ, ఎన్నికల సంఘం భాగస్వా ములని కాంగ్రెస్ ఆరోపించింది. విలేకరుల సమావేశంలో నటరాజన్ మాట్లాడుతూ.. తాను ‘ఫారం 26’ను సక్రమంగా నింపానని, అందులో ప్రైవేట్ ఫిర్యాదుల నమోదుకు కాలమే లేదని, ప్రస్తుతం ఎలాంటి క్రిమినల్ కేసు పెండింగ్‌‌లో లేదని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు జితు పట్వారీ, ఉమంగ్ సింఘార్ మాట్లాడుతూ, మూడో సీటు గెలవ డానికి బీజేపీకి 10 మంది ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉందని, అందుకే కుట్రపూరితంగా నామినేషన్‌‌ ను రద్దు చేయించారని మండిపడ్డారు. ఝార్ఖండ్‌‌లో పరిమల్ నత్వానీకి తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిన ఈసీ.. తమ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించిందన్నారు.

దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: బీజేపీ డిమాండ్  

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధులు ప్రదీప్ భండా రీ, షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంతర్గత కలహాలు, నాయకత్వ వైఫల్యం వల్లే అభ్యర్థి ఓడిపోయారని ఆరోపించారు. తెలంగాణలోని వారి సొంత ప్రభుత్వమే ఈ ఓటమికి దోహదపడిందని, రాహుల్ ఇకనైనా 'బాధితుడి కార్డు' ఆటను ఆపాల న్నారు.

ఫలితాలు అనుకూలంగా రానప్పుడల్లా రాజ్యాంగ సంస్థలపై దాడి చేయడం తగదన్నారు. కాగా, ఈ తిరస్కరణతో మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్‌‌లు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.