
దేశవ్యాప్తంగా సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయడం పై రూల్స్ రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అయితే అకౌంట్ సస్పెండ్ చేయడంలో లేదా బ్లాక్ చేయడంలో సోషల్ మీడియా కంపెనీలకి స్పష్టమైన విధానాలు ఉండాలని పిటిషనర్లు కోరారు.
ఆర్టికల్ 32 ప్రకారం వాట్సాప్ ప్రాథమిక హక్కుగా ఎలా పిలుస్తారని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కొద్దిరోజుల క్రితం ఒక మేడ్ ఇన్ ఇండియా మెసేజింగ్ యాప్ లాంచ్ అయిందని, దీనిని పిటిషనర్లు ఉపయోగించవచ్చని కూడా ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ కలనుకుంటే ఈ విషయాన్ని కింద కోర్టుకు తీసుకెళ్లవచ్చని కూడా సూచించింది.
100 రెట్లు పెరిగిన డౌన్‌లోడ్‌లు: జోహోకి చెందిన కొత్త మెసేజింగ్ యాప్ "Arattai" గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సెప్టెంబర్‌లో ఈ యాప్ డౌన్‌లోడ్‌లు 100 రెట్లు పెరిగాయి. అక్టోబర్ 3 నాటికి దీనిని 75 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ యాప్‌ను ఉపయోగించడం విశేషం.
Arattai యాప్‌ను జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసి 2021లో ప్రారంభించింది. Arattai అంటే తమిళంలో "సాధారణ చాట్" అని అర్థం. మీరు వాయిస్, వీడియో కాలింగ్, స్టోరీ ఫీచర్, ఛానల్ వంటి ఫీచర్లతో పాటు టెక్స్ట్ మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, డాకుమెంట్స్ పంపవచ్చు. Arattaiని 1996లో శ్రీధర్ వెంబు, టోనీ థామస్ స్థాపించిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. నేడు Arattai ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో 13 కోట్లకు పైగా యూజర్లకు సేవలు అందిస్తోంది. జోహో ఇమెయిల్, CRM, HR, అకౌంటింగ్ అండ్ ప్రాజెక్ట్ నిర్వహణతో సహా 55 కంటే ఎక్కువ బిజినేస్ యాప్స్ అందిస్తుంది.
అయితే "మేడ్ ఇన్ ఇండియా" ట్యాగ్, ప్రైవసీ, యాప్ డిజైన్ సహా ప్రభుత్వ సపోర్ట్ Arattai డౌన్‌లోడ్‌లలో పెరుగుదలకు దారితీశాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా Arattaiని ఉపయోగించాలని ప్రజలను కోరారు. Arattai గొప్ప ఫీచర్ ఏంటంటే తక్కువ-బ్యాండ్‌విడ్త్ యూసేజ్ ఫీచర్, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ బలహీనంగా లేదా సరిగ్గాలేని ప్రాంతాలలో కూడా పనిచేస్తుంది. తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఈ యాప్ పనిచేస్తుంది.
ప్రస్తుత మెసేజింగ్ యాప్‌లలో ఉండే అన్ని ఫీచర్లు అర్తాయ్‌లో ఉన్నాయి. వన్-టు-వన్, గ్రూప్ చాట్‌లు, వాయిస్ నోట్స్, ఇమేజెస్, వీడియో షేరింగ్, ఆడియో& వీడియో కాల్స్ఎం అన్ని ఎండ్ -టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితంగా ఉంచుతుంది. అంతేకాదు స్మార్ట్ ఫోన్స్, డెస్క్‌టాప్స్, ఆండ్రాయిడ్ టీవీలలో కూడా పనిచేస్తుంది.
దీనిలోని చాలా ఫీచర్లు వాట్సాప్‌తో సమానంగా గట్టి పోటీ ఇస్తుంది. కానీ ఈ యాప్లో ఉన్న అతిపెద్ద లోపం మెసేజెస్ పై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) లేకపోవడం. వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారు, పొందినవారు మాత్రమే మీ మెసేజెస్ చదవగలరు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా జీమెయిల్ నుండి మేడ్ ఇన్ ఇండియా జోహో మెయిల్‌కు (Zoho Mail) మారారు. ఇకపై అందరూ ఈ కొత్త ఈమెయిల్ అడ్రసుకు మాత్రమే ఈమెయిల్స్ పంపాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జోహో మెయిల్‌ను కూడా శ్రీధర్ వెంబునే రూపొందించారు.