బీఆర్ఎస్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

బీఆర్ఎస్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

బీఆర్ఎస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వేసిన  పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్  సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.  ఫ్రీ సింబల్ జాబితాలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని కోరింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది. 

కారును పోలిన  గుర్తులను ఏ పార్టీ అభ్యర్థికీ కేటాయించవద్దని  బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, కెమెరా, చపాతి రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ,ఆటోరిక్షా ట్రక్ వంటి గుర్తులను ఫ్రీ సింబల్స్ లిస్టు నుంచి తొలగించాలని పిటిషన్ లో పేర్కొంది. 

Also Read :-  సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా 

యుగతులసి పార్టీకి తెలంగాణ, ఏపీలో పోటీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  ఇటీవల రోడ్ రోలర్ గుర్తును కేటాయించింది.  గతంలో ఈ గుర్తుతో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న బీఆర్ఎస్    కారును పోలిన గుర్తులను తొలగించాలని సుప్రీం కోర్టుకెళ్లింది. కారును పోలిన గుర్తుల వల్ల బీఆర్ఎస్ కు ఎన్నికల్లో నష్టం కల్గుతుందని  పిటిషన్ లో పేర్కొన్నారు. జస్టిస్  అభయ్ ఓకా,జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా బీఆర్ఎస్ పిటిషన్ ను డిస్మీస్ చేసింది.