
- గ్రూప్ 1కు సంబంధించి విచారణ పూర్తైన జీవో 29పై రిట్ పిటిషన్ వేస్తరా?
- మండిపడ్డ సుప్రీంకోర్టు
- పిటిషనర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరిక
- పిటిషనర్ విజ్ఞప్తి మేరకు విత్ డ్రా కు అనుమతి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే గ్రూప్ – 1 అపాయింట్మెంట్ ప్రక్రియ, గ్రూప్ –2, 3 నోటిఫికేషన్స్ పై స్టే ఇవ్వాలని దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆ పిటిషన్ను డిస్మిస్చేసింది. గ్రూప్స్ నోటిఫికేషన్స్ కు సంబంధించి జీవో 29, జీవో 33, పీహెచ్ సీ రిజర్వేషన్లు వర్టికల్ గా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. కుమ్మరి ప్రవీణతో పాటు మరో 12 మంది గత నెల 30న సుప్రీంకోర్టులో 370 పేజీల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్– 1 కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 రాజ్యాంగబద్ధమా? కాదా? తేల్చాలని కోరారు.
ఈ అంశంలో ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారనే అంశంపైనే పిటిషన్లు కొట్టివేశారని, మెరిట్స్ పై పిటిషన్లు తోసిపుచ్చలేదని పేర్కొన్నారు. భవిష్యత్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ లో అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. అలాగే, ఎస్సీ రిజర్వేషన్ల ను 6 నుంచి 10 శాతానికి పెంచేందుకు జీవో 33 ద్వారా ప్రభుత్వం తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సరికాదని, ఈ ప్లేస్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్ లో ప్రస్తావించారు. పీడబ్ల్యూడీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో 10, జీవో 96ను రద్దు చేయాలని కోరారు. పీహెచ్సీని హారిజంటల్గా ఇప్లిమెంట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.
ఈ 3 అంశాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ల పై ప్రభావం చూపుతున్నందున..ప్రభుత్వ నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ రిట్ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జోమాల్య బగ్చి తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఇరువైపులా వాదనలు
ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, ఏవోఆర్ దేవినా సెఘల్, పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ రాణా ముఖర్జీ వాదనలు వినిపించారు. ఇప్పటికే గ్రూప్ –1 నోటిఫికేషన్ వ్యవహారంలో జీవో –29 రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ విషయాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం సీరియస్ అయింది. పిటిషనర్లకు కాస్ట్ ఇంపోజ్ చేస్తామని హెచ్చరించింది. దీంతో తమ పిటిషన్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతివ్వాలని పిటిషనర్లు అభ్యర్థించగా.. డిస్మిస్ అండ్ విత్ డ్రా కు కోర్టు అనుమతించింది..