Childrens care: చలి ముదిరింది.. బడి పిల్లలు జాగ్రత్త..!

Childrens care:  చలి ముదిరింది.. బడి పిల్లలు జాగ్రత్త..!

శీతాకాలం  అంచనాలను మించి ప్రజలను వణికిస్తోంది.  ఉదయం 7 గంటల వరకూ చలి దెబ్బకు చేతులు కాళ్లు నిస్సత్తువగా మారిపోతున్నాయి. చలికాలంలో పెద్దవాళ్లకే ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇక పిల్లలకైతే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజుల్లో అమ్మానాన్నలు పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. 

ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పిల్లలకు శ్వాసకోస సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే పిల్లలకు అవసరమైన 'డి' విటమిన్తక్కువగా అందుతుంది. తిండి కూడా సరిగా తినరు. స్కూల్​ కు  పంపించిన లంచ్ బాక్స్ ను అలాగే తిరిగి తెచ్చేస్తుంటారు. కాబట్టి బడి నుంచి వచ్చిన తర్వాత పిల్లల బాక్సు, వాళ్లలో వచ్చిన మార్పును గమనిస్తూ ఉండాలి. 

స్కూల్​ కు  పంపేటప్పుడే స్కూల్ యూనిఫార్మ్ తో పాటు స్వెట్టర్ వేయాలి. అవసరం అయితే మంకీక్యాప్ కూడా పెట్టాలి. సాక్స్ లు  వేయటం వల్ల పాదాలకు అంటుకునే దుమ్ము, దూళివల్ల నుంచి రక్షణ పొందుతారు. చర్మానికి దద్దుర్లు లాంటి అలర్జీలు వస్తుంటాయి. వాళ్ల దుస్తులు. వాడే వస్తువులు అన్నీ పొడిగా, శుభ్రంగా ఉండేలా తల్లులు జాగ్రత్తతీసుకోవాలి. 

శీతా కాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువ కాబట్టి, పిల్లలకు సర్ది చేసే కేక్స్, చాక్లెట్స్ లాంటి వాటికి దూరంగా ఉంచాలి.జలుబు, దగ్గు, తుమ్ములు వంటి రోగాలు చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లోని చిట్కాలకు తగ్గకపోతే, నాలుగైదు రోజుల తర్వాత తప్పకుండా వైద్యుని దగ్గరకు తీసుకెళ్లాలి