చిదంబరం సీబీఐ కస్టడీని రేపటివరకు పొడిగింపు…

చిదంబరం సీబీఐ కస్టడీని రేపటివరకు పొడిగింపు…

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని రేపటివరకు పొడిగించింది రోస్ అవెన్యూ కోర్ట్. దీంతో పాటే…  చిదంబరం బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరిపేందుకు డిసైడ్ అయింది.

పొద్దున చిదంబరం బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ముందుగా చిదంబరం సీబీఐ కస్టడీని గురువారం వరకు పొడిగించింది సుప్రీం. తిహార్ జైలుకు తరలించకుండా ఆదేశాలిచ్చింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచింది. తర్వాత ఆర్డర్ కాపీలో మార్పులు చేసిన సుప్రీం… ఈ కేసును రేపు మళ్లీ విచారిస్తామని తెలిపింది. అలాగే చిదంబరం కస్టడీ విషయంలో ట్రయల్ కోర్టుకు వెళ్లాలా..? వద్దా అనే విషయంలో సీబీఐకి స్వేచ్ఛనిచ్చింది. ఒకవేళ చిదంబరం బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తే సీబీఐ కస్టడీకి పంపాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. దీంతో చిదంబరం ను రోజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది సీబీఐ.