బిల్కిస్‌ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్‌

బిల్కిస్‌ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్‌

న్యూఢిల్లీ:  బిల్కిస్‌ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. దోషుల్లోని ఇద్దరు భగవాన్‌దాస్‌ షా, రాజుభాయ్‌ బాబులాల్‌ దాఖలు చేసిన మద్యంతర బెయిల్‌ పిటిషన్‌లను జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం  కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను 'పూర్తి తప్పు' అని పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్​జారీ చేసిన ఆర్డర్​పై మరొక బెంచ్​ఎలా అప్పీల్​చేస్తారని ప్రశ్నించింది.  

కాగా 2022లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున తమను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఈ ఏడాది జనవరిలో కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భగవాన్‌దాస్, బాబూలాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా రిమిషన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు తాత్కాలికంగా తమను విడుదల చేయాలని దోషులిద్దరూ కోరారు. గుజరాత్‌లోని గోద్రాలో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో  బిల్కిస్​బానోపై లైంగికదాడి చేసి, ఆమె కుటుంబ సభ్యులను హతమార్చిన సంగతి తెలిసిందే.