ఈడీ కేసులో చిదంబరానికి బెయిల్‌

ఈడీ కేసులో చిదంబరానికి బెయిల్‌

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సుప్రీం కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఇవాళ(శుక్రవారం) సుప్రీం తీర్పునిచ్చింది. ఆగస్ట్ 26 వరకు అరెస్ట్ చేయకూడదని తన తీర్పులో తెలిపింది.

ఆగస్ట్ 26 వరకు సీబీఐ కస్టడీకి చిదంబరాన్ని అనుమతి ఇస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టులో చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. కపిల్ సిబల్ బలమైన వాదనలు వినిపించారు. సీబీఐ నిబంధనలు పాటించలేదని.. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమన్నారు. చిదంబరం అరెస్ట్‌ అప్రజాస్వామికమన్నారు. ED ఎలాంటి అఫిడవిట్‌ దాఖలు చేయలేదని చెప్పారు. ఈడీ నోటీసులో ఎలాంటి సాక్ష్యాలు లేవన్నారు. ముందస్తు బెయిల్‌పై ఢిల్లీ కోర్టు తీర్పును ప్రస్తావించిన సిబల్.. ఈడీ నోటీసును ఢిల్లీ హైకోర్టు జడ్జి మక్కీకి మక్కీ కాపీ చేశారన్నారు. ఈ సందర్భంగా చిదంబరానికి 17 అంతర్జాతీయ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని సీబీఐ లాయర్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.