
చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చనిపోయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని గతంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానికి సంబంధించిన పిల్ సుప్రీంకోర్టులో నేడు విచారణకు వచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
For More News..