INX కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు

INX కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. INX మీడియా కేసుకు సంబంధించి CBI కేసులో ఇవాళ(మంగళవారం) లక్ష రూపాయల పూచికత్తుపై ఈ ఉదయం బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు. ఈ కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. చిదంబరంతో పాటు మరో 14మందిపై CBI ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

ప్రస్తుతం చిదంబరం ఇదే కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో ఉన్నారు. ఈ నెల 24 వరకూ ED కస్టడీ కొనసాగనుంది. దాదాపు రెండు నెలల నుంచి చిదంబరం తీహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ మంజూరు అయినా, ED కస్టడీలో ఉన్నందున 24వ తేదీ వరకూ ఆయన విడుదల అయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది.