తీస్తా సెతల్వాడ్‌‌కు ఊరట

తీస్తా సెతల్వాడ్‌‌కు ఊరట

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టు అప్పచెప్పాలని సూచించింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు నకిలీ పత్రాలను సృష్టించారనే ఆరోపణలపై ఆమెను జూన్ 25న అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం క్రిమినల్ కుట్ర, ఫోర్జరీ, ఐపీసీ ఇతర సెక్షన్లను నమోదు చేశారు. గత రెండు నెలలకు పైగా ఆమె కస్టడీలో ఉన్నారన్న సీజేఐ జస్టిస్ యూయూ లలిత్.. ఈ సమయంలో పోలీసులు ఏ వివరాలు సేకరించారో చెప్పాలని ఆదేశించారు. ఏం జరిగిందన్న విషయం తప్ప ఎఫ్ఐఆర్ లో ఇంకే వివరాలు లేవని అభిప్రాయపడ్డారు. తీస్తా సెతల్వాడ్ పై సాధారణ సెక్షన్లు తప్ప పోటా, UAPA వంటి నేరాలు లేవని సుప్రీం ధర్మాసనం చెప్పింది. 

2002 గుజరాత్ అల్లర్లలో ధ్వంసమైన గుల్బర్గా సొసైటీ బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటు చేస్తానంటూ తీస్తా సెతల్వాడ్ నిధులు సేకరించారు. అయితే ఆ సొమ్మును ఆమె సొంత అవసరాలకు వాడుకున్నారనే అభియోగాలతో గతంలో ఓ కేసు నమోదైంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు జూన్ 24న తీర్పు ఇచ్చింది.