సుప్రీం తీర్పు: చెత్తను కాలిస్తే రూ.5 వేల ఫైన్, ఉల్లంఘిస్తే రూ.లక్ష ఫైన్

సుప్రీం తీర్పు: చెత్తను కాలిస్తే రూ.5 వేల ఫైన్, ఉల్లంఘిస్తే రూ.లక్ష ఫైన్

ఢిల్లీ:రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో చెత్తను కాల్చినా, బహిరంగ ప్రదేశాలలో వేసినా వారికి ఐదు వేల రూపాయల జరిమానా విధించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారు లక్ష రూపాయలు ఫైన్ గా కట్టాలని తెలిపింది.  నగరంలో వెంటనే భవన నిర్మాణ, అభివృద్ధి పనులను ఆపేయాలని, ఉల్లఘించి నిర్మాణాలు చేపట్టిన వారికి కూడా భారీ జరిమానా విధించాలని కోర్టు ఆదేశించింది. రైతులకు పంట వ్యర్థాలను కాల్చే   హక్కు లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి గ్రామ ప్రధాన్ వరకూ  ప్రతి ఒక్కరూ అలా  కాల్చిన సంఘటన ఏదైనా ఉంటే బాధ్యత వహించాలని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 6 వ తేదీకి వాయిదా వేసింది.

Supreme Court halts construction activity, announces Rs 1 lakh fine for violation