ప్రశాంత్ భూషణ్ కు ఒక్క రూపాయి ఫైన్..కట్టకపోతే 3 నెలల జైలు శిక్ష

ప్రశాంత్ భూషణ్ కు ఒక్క రూపాయి ఫైన్..కట్టకపోతే 3 నెలల జైలు శిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు శిక్ష ఖరారు చేసింది సుప్రీంకోర్టు. ఒక రూపాయి జరిమాన విధించింది. సెప్టెంబర్ 15 లోపు జరిమానా కట్టకపోతే 3 నెలలు జైలు శిక్ష,3 సంవత్సరాలపాటు ప్రాక్టీస్ పై నిషేధం విధించింది. సుప్రీంకోర్టు జడ్జిలు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆగస్ట్ 14న కోర్టు ధిక్కరణ కేసులో భూషణ్ ను దోషిగా తేల్చింది.

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్ భూషణ్..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,కోర్టుల పనితీరు పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. వ్యవస్థలను మెరుగుపరిచేందుకు,తప్పులను సరిదిద్దుకుంటారని విమర్శలు చేశానన్నారు ప్రశాంత్ భూషణ్.

see more news

సీబీఐతోనే నిజాలు బయటకొస్తయ్..ప్రధానికి రేవంత్ లేఖ

తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి

ఒక్కరోజే 78,512 కేసులు..971 మరణాలు

రూ.8 లక్షల ఫ్లాట్.. బిల్డర్‌కు రూ.48 లక్షల ఫైన్