
సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ACB కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఊరట కలిగిస్తూ.. ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ACBని ఆదేశించింది. 4 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నాంపల్లిలోని PMLA ప్రత్యేక కోర్టులో నిన్న(గురువారం) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎంపీ రేవంత్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్‌సింహ, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణకీర్తన్ పై అభియోగాలు నమోదు చేసింది.