రేవంత్ కేసు కోసం ఢిల్లీ నుంచి ప్రముఖ న్యాయవాది

రేవంత్ కేసు కోసం ఢిల్లీ నుంచి ప్రముఖ న్యాయవాది

కేటీఆర్ ఫాంహౌజ్‌పై డ్రోన్‌ను ఉపయోగించిన కేసులో రేవంత్ రెడ్డి వారం రోజుల కింద అరెస్టయ్యారు. ఆయన ఇప్పుడు చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే ఆయన కేసును వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఆధ్వర్యంలో కొంతమంది లాయర్లు హైదరాబాద్‌కు వచ్చారు. వారంతా రేవంత్ తరపున కోర్టులో వాదించనున్నారు. సల్మాన్ ఖుర్షీద్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. సెంట్రల్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన న్యాయశాఖకు మంత్రిగా పనిచేశారు.

ఇది ఇలా ఉండగా.. అక్రమంగా డ్రోన్‌ను ఉపయోగించిన కేసులో జైలులో ఉన్న రేవంత్ రెడ్డిపై మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. ప్రగతి భవన్ ముట్టడి కేసులో రేవంత్ రెడ్డిపై పీటీ వారెంట్ జారీ చేశారు. దాంతో ఆ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డిని నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగా.. ఒక కేసు వల్ల రేవంత్ రెడ్డి జైలులో ఉండగానే మరో కేసు పెట్టడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన అనుచరులు అంటున్నారు.

For More News..

సింధియాకు షాక్.. 6 ఏళ్ల క్రితం కేసు రీఓపేన్

పీసీసీ చీఫ్ నువ్వా.. నేనా..

ఇండియాలో కరోనా తొలి మరణం

అప్పుడు కేసీఆర్‌‌ను బండ బూతులు తిట్టిన