అసెంబ్లీలో బలపరీక్షపై మీరేమంటరు?

అసెంబ్లీలో బలపరీక్షపై మీరేమంటరు?

మధ్యప్రదేశ్ సీఎం, స్పీకర్​లకు సుప్రీం నోటీసులు
ఈరోజే జవాబివ్వాలని ఆదేశం
చౌహాన్​ పిటిషన్​పై నేడు విచారణ
రెబల్​ ఎమ్మెల్యేల ఇంప్లీడ్​కు ఓకే
సింధియా వెంటే మేము:  రెబల్​ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ, భోపాల్, బెంగళూరు: అసెంబ్లీలో వెంటనే ఫ్లోర్​టెస్ట్​ నిర్వహించాలన్న డిమాండ్​పై ప్రభుత్వ స్పందనేంటని సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్​ను ప్రశ్నించింది. బీజేపీ సీనియర్​ లీడర్  శివరాజ్​సింగ్​ చౌహాన్​ పిటిషన్​ను మంగళవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్​ హేమంత్​ గుప్తా ఆధ్వర్యంలోని బెంచ్​పరిశీలించింది. ఈ విషయంలో సర్కారు స్పందన తెలుసుకోవాలని సీఎం కమల్​నాథ్, స్పీకర్​ ఎన్.ప్రజాపతి, అసెంబ్లీలో ప్రిన్సిపల్​ సెక్రటరీలకు బెంచ్​ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ స్పందనను బుధవారంలోగా కోర్టుకు తెలియజేయాలని ఆదేశిస్తూ చౌహాన్​ పిటిషన్​ను కూడా అప్పుడే విచారిస్తామని బెంచ్​ పేర్కొంది. కోర్టు నోటీసులతో పాటు ఈ మెయిల్​ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం తదితరులకు నోటీసులు ఇచ్చేందుకు చౌహాన్​కు కోర్టు అనుమతిచ్చింది.

చౌహాన్​ పిటిషన్ ​విచారణలో ఇంప్లీడ్​ అయ్యేందుకు అనుమతించాలన్న రెబల్​ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని ఆమోదించింది. అంతకుముందు కాంగ్రెస్​ ఎమ్మెల్యేల రాజీనామాలతో కమల్​నాథ్​ సర్కారు మెజారిటీ కోల్పోయిందని, అసెంబ్లీలో ఫ్లోర్​ టెస్ట్​ నిర్వహించాలని చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు గవర్నర్​కు శనివారం విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్​ లాల్​జీ టాండన్​స్పీకర్​కు సూచించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బడ్జెట్​ సమావేశాలను స్పీకర్​ ఈ నెల 26 కు వాయిదా వేశారు. దీనిపై చౌహాన్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో వెంటనే ఫ్లోర్​ టెస్ట్​ నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. మరోవైపు,  మధ్యప్రదేశ్​ వుమెన్స్​ కమిషన్​ చైర్​పర్సన్​గా కాంగ్రెస్​ లీడర్​ షోబా ఓఝా మంగళవారం పదవీ బాధ్యతల్ని తీసుకున్నారు. ఈ నియామకంపై సీరియస్​ అయిన బీజేపీ నేతలు గవర్నర్​ టాండన్​ను కలిశారు. కాన్​స్టిట్యూషనల్​ పోస్టుల నియామకాలను అడ్డుకోవాలని మెమోరాండం అందజేశారు.

చౌహాన్​ పిటిషన్​లో ఏముందంటే..

మధ్యప్రదేశ్​లో 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సర్కారు మెజారిటీ కోల్పోయింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని మేం డిమాండ్​ చేసినా, గవర్నర్​ ఆదేశించినా స్పీకర్​ పట్టించుకోలేదు. స్పీకర్ తో పాటు అసెంబ్లీ ప్రిన్సిపల్​ సెక్రెటరీ ఉద్దేశపూర్వకంగా గవర్నర్​ ఆదేశాలను ఎదిరించారు. రాజ్యాంగ విలువలను కాలరాశారు. అసెంబ్లీలో వెంటనే ఫ్లోర్​ టెస్ట్​ నిర్వహించి, బల నిరూపణ చేసుకోవాలన్న గవర్నర్​ ఆదేశాలను అమలుచేసేలా చూడాలి. ‘కోర్టు ఆదేశాలు వెలువడ్డ 12 గంటల్లో ఫ్లోర్​ టెస్ట్​ నిర్వహించాలని స్పీకర్​ను ఆదేశించండి’ అంటూ శివరాజ్​సింగ్​ చౌహాన్​ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్​లో చౌహాన్​తోపాటు గోపాల్​ భార్గవ, నరోత్తం మిశ్రా సహా 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత