త్రిపుల్ తలాఖ్ పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

త్రిపుల్ తలాఖ్ పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

త్రిపుల్‌ తలాఖ్‌ ఆచారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం 2019ను సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్రిపుల్ తలాఖ్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణించే అంశాన్ని కోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(శుక్రవారం) విచారణ జరిపింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.