ఇరు రాష్ట్రాల జల విద్యుత్ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

ఇరు రాష్ట్రాల జల విద్యుత్ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
  • వచ్చే నెల 19న పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ చేపట్టనున్న కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ, తెలంగాణ మధ్య నెల కొన్న జల విద్యుత్ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే నెల 19న ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ చేపడతామని చెప్పింది. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ 2021లో కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఫిర్యాదు చేసింది. అదే ఏడాది జులై 14న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జల విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తిపై తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7న మరో పిటిషన్ దాఖలు చేసింది.

 ఆ రెండు పిటిషన్లను కలిపి సోమవారం జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ మన్మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన ద్విసభ ధర్మాసనం విచారించింది. ఈ అంశంలో సుదీర్ఘ వాదన లు వినాల్సిన అవసరం ఉన్నందున, విచారణను ఆగస్టు 19కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.