కేరళ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

కేరళ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

బుధవారం బక్రీద్ పండగ సందర్భంగా కేరళ ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడిలించింది. వ్యాపారులకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బక్రీద్ పండుగ కోసం కరోనా రూల్స్ ను సడలించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేరళ ప్రభుత్వ వైఖరి షాకింగ్‌కు గురిచేస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో కొత్తగా ఏవైనా ఇన్ఫెక్షన్లు పెరిగితే, అలాంటి ఘటనలకు కోర్టు ముందుకు తీసుకువస్తే, అప్పుడు కేరళపై చర్యలు తీసుకుంటామని సుప్రీం తెలిపింది. కన్వర్‌ యాత్ర నిర్వహణలో యూపీ ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పును పరిశీలించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.