మీది బాధ్యత లేని వ్యక్తిత్వం : రాందేవ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

మీది బాధ్యత లేని వ్యక్తిత్వం : రాందేవ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

పతంజలి ఉత్పత్తుల ప్రకటనలపై.. రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీకు బాధ్యత లేదు.. మీది బాధ్యత లేని వ్యక్తిత్వం అంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. పతంజలి ఆయుర్వేదంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది. రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ హాజరైయారు. న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మళ్లీ మళ్లీ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని పతంజలి ప్రకటనపై మందలించింది. 

కోర్టు ధిక్కార చర్యలను తేలికగా తీసుకోదని హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగానే సుప్రీం కోర్టు ఆదేశాన్ని లెక్కచేయడం లేదని ధర్మాసనం సీరియస్ అయింది. పతంజలి ఉత్పత్తులకు లైసెన్స్‌ను ఇచ్చిన ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  విమర్శించింది. అఫిడవిట్‌లో చెప్పిన దానితో తాము సంతృప్తి చెందలేదని కోర్టు పేర్కొంది. గతవారం రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ లు చెప్పిన క్షమాపణలను కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది.

Also Read :నీళ్ల సమస్యతో తగ్గిన ఇంటి అద్దెలు.. ఖాళీ చేసి వెళుతున్న జనం