Delhi Liquor Scam: మధ్యంతర బెయిల్ ఇవ్వలేం.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీం

Delhi Liquor Scam: మధ్యంతర బెయిల్ ఇవ్వలేం.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీం

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ ఆశించిన కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మధ్యంతర బెయిల్ అనొద్దని.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ బెంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ సీబీఐ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ దక్కలేదు. దీంతో.. కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉన్నారు. 

కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు.. ఆయన బెయిల్ పిటిషన్పై స్పందించాల్సిందిగా సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 23కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ మనీలాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలపై సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇటీవల బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 17 నెలల జైలు జీవితం అనంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో పోటీ చేసిన క్రమంలో ఎన్నికల ఖర్చు కోసం కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేశారని, ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్తోంది.

ఇక.. లిక్కర్ స్కాంలో తీహార్‌‌‌‌‌‌‌‌లో జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని రౌస్‌‌‌‌ ఎవెన్యూ కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా జైల్‌‌‌‌ నుంచి కేజ్రీవాల్, కవితను వర్చువల్ మోడ్‌‌‌‌లో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 

కవిత తరఫు న్యాయవాది మోహిత్‌‌‌‌ రావు వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు సంస్థలు సాక్ష్యుల వాంగ్మూలాలను నమోదు చేసిన సమయంలో రికార్డు చేసిన వీడియో పుటేజీలు తమకివ్వాలని కోరారు. సాక్ష్యులపై ఒత్తిడి తెచ్చి కవితపై తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేశారని ఆరోపించారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 50 ప్రకారం దర్యాప్తు సంస్థ నమోదు చేసిన వాంగ్మూలాల్లో నిజం లేదని చెప్పారు. ఈడీ తరఫు అడ్వొకేట్ ఈ వాదనలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఇరు వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.