మారటోరియం పొడగించాలన్న పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు

మారటోరియం పొడగించాలన్న పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు

కరోనా, లాక్‌డౌన్‌  సమయంలో రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)మారటోరియం విధించింది. మారటోరియంను మరికొంత కాలం పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.  విధించిన మారటోరియం పొడిగింపు.. మొత్తం వడ్డీని మాఫీ చేయడం లాంటి అంశాలపై సుప్రీం మంగళవారం కీలక తీర్పునిచ్చింది. RBIఅందించే ఆరు నెలల రుణ మారటోరియంను పొడిగించాలని కోరుతూ వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.  మారటోరియం కాలంలో రుణాలపై చక్రీవడ్డీని పూర్తిగా ఎత్తేయాలని ఆదేశించలేమని తెలిపింది. అలాగే  మారటోరియం కాలాన్ని పెంచాలని కూడా తాము చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఆర్థిక పరమైన అంశాల్లో న్యాయపరమైన విచారణను చేపట్టలేమని తెలిపింది.  ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని లేదా కేంద్ర బ్యాంకును ఆదేశించలేమని, ప్రత్యేక రంగాలకు ఉపశమనం అడగలేమని కూడా సుప్రీం తేల్చి చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేసిందని గుర్తు చేసింది సుప్రీం.