ఎలక్షన్ బాండ్లపై స్టేకు సుప్రీం నో

ఎలక్షన్ బాండ్లపై స్టేకు సుప్రీం నో

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై సవివరంగా విచారణ జరగాల్సి ఉందని, సరైన పిటిషన్ ను సమర్పించాలని పేర్కొంది. శుక్రవారం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎన్జీవో తరఫున అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ విచారణకు హాజరయ్యారు. ఈ స్కీమ్ వల్ల గుర్తుతెలియని వ్యక్తులు వేల కోట్లను రాజకీయ పార్టీలకు ఇస్తున్నారని, 95 శాతం సొమ్ము అధికార పార్టీకే వెళ్లిందని కోర్టుకు నివేదించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. రాజకీయ పార్టీల్లోకి బ్లాక్ మనీ ప్రవాహాన్ని అడ్డకునేందుకే ఎలక్టోరల్ బాండ్స్ ప్రవేశపెట్టామని, అధికార పార్టీకే బాండ్ల డబ్బంతా వెళుతోందంటూ ప్రశాంత్ భూషణ్ ఎలక్షన్ స్పీచ్ ఇస్తున్నారని విమర్శించారు. వాదనలు విన్న బెంచ్ విచారణను పదో తేదీకి వాయిదా వేసింది.